'ప్రజా పాలన' గ్రామసభలో సమస్యలపై చర్చ..!
MDK: చిలిపిచెడ్ మండలం తోఫియా తండాలో సర్పంచ్ అధ్యక్షతన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99' కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తాము పొందిన ప్రయోజనాల గురించి వివరించారు. అనంతరం తండాలో నెలకొన్న తాగునీటి ఎద్దడి, సీసీ రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలను గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.