నేపాల్ అటార్నీ జనరల్‌గా సబితా భండారీ

నేపాల్ అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాది సబితా భండారీ నియమితులయ్యారు. ఈ బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా సబితా చరిత్రకెక్కారు. ఆ దేశ తాత్కాలిక ప్రధాని సుశీల సిఫారసు మేరకు అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సబితా నియామకానికి ఆమోద ముద్ర వేశారు. ఆమె గతంలో నేషనల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చీఫ్‌గా కూడా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు.