అంబేద్కర్‌కు గజమాల అలంకరించిన ఎమ్మెల్యే ఆనందరావు

అంబేద్కర్‌కు గజమాల అలంకరించిన ఎమ్మెల్యే ఆనందరావు

కోనసీమ: ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి గ్రామంలో శనివారం అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి గజమాల అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ సత్తిబాబురాజు, అమలాపురం నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు గొల్లకోటి చిన్న తదితరులు పాల్గొన్నారు.