568 ఓట్ల భారీ మెజారిటీతో భాగ్యశ్రీ గెలుపు

568 ఓట్ల భారీ మెజారిటీతో భాగ్యశ్రీ గెలుపు

ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండర సర్పంచ్‌గా భాగ్య శ్రీ గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థిపై 568 ఓట్ల తేడాతో భారీ మెజారిటీ సాధించి ఘన విజయం సాధించారు. దీంతో ఆమె అనుచరులు గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు.