నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు మూసివేత

KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను శనివారం మధ్యాహ్నం నిలిపివేసినట్లు ప్రాజెక్టు ఏఈఈ అక్షయ్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 13,590 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 1,800 క్యూసెక్కుల నీటిని పంట సాగుకు విడుదల చేసినట్లు వివరించారు. ప్రాజెక్టులో 16.357 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.