రైతుల సమస్యలపై రైల్వే అధికారులతో సమావేశం

విజయనగరం: గజపతినగరం రైల్వే కాలనీ దగ్గర రైల్వే మూడో లైన్ ఆధునీకరణ నేపథ్యంలో తలెత్తుతున్న సమస్యలపై గురువారం రైల్వే అధికారులతో పురిటిపెంట ఉప సర్పంచ్ మండల సురేష్ చర్చించారు. మూడో లైన్ వలన స్థానికంగా ఉన్న కల్వర్ట్లను మూసివేసినందున సుమారు 30 కుటుంబాల రైతులు నీటి సమస్యతో పాటు 200 కుటుంబాల వారి స్మశాన వాటిక సమస్య ఏర్పడుతుందని గుర్తించారు.