రాయదుర్గం రూరల్ సీఐను అభినందించిన జిల్లా ఎస్పీ
ATP: రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ జిల్లా ఎస్పీ జగదీష్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. బుధవారం రూరల్ పరిధిలో పాత కేసుల పురోగతి, ప్రజలకు అందిస్తున్నసేవలను గుర్తించి అభినందించి ప్రశంసా పత్రం అందజేసినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువగా ఉంటూ గొప్ప సేవలు అందిస్తానని పేర్కొన్నారు.