తహసీల్దార్‌కు సమస్యలపై వినతి

తహసీల్దార్‌కు సమస్యలపై వినతి

NLG: చిట్యాల నూతన తహసీల్దార్ విజయ్ కుమార్‌ను బీజేపీ నేత అశోక్ కలిసి పలు సమస్యలను విన్నవించారు. పూర్తి చేసిన 241 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని, కొత్తగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. సాదాబైనామా, భూ సమస్యలు పరిష్కరించడంతో పాటు అమృత్ 2.0 ట్యాంకుల నిర్మాణం పూర్తి చేసి నీటి ఇబ్బందులు తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.