సిబ్బంది సంక్షేమానికి ఎస్పీ మెన్ గ్రీవెన్స్

సిబ్బంది సంక్షేమానికి ఎస్పీ మెన్ గ్రీవెన్స్

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ప్రతి శుక్రవారం మెన్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నారు. ఇవాళ జిల్లా పోలీస్ కార్యాలయంలో పలువురు సిబ్బంది స్వయంగా ఎస్పీని కలిసి తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వాటిపై ఎస్పీ సానుకూలంగా స్పందించారు. నిత్యం పని ఒత్తిడిలో ఉండే సిబ్బంది ఉద్యోగపరంగా లేదా వ్యక్తిగతంగా ఏ సమస్య అయినా నేరుగా దరఖాస్తు చేయవచ్చన్నారు.