రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

ASF: కౌటాల మండలంలోని గుండాయిపేట్ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రేషన్ బియ్యాన్ని నిల్వ చేసినట్లు అందిన సమాచారం మేరకు, శుక్రవారం సాయంత్రం ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు దాడి చేసి సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. అధికారులు బియ్యాన్ని సీజ్ చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేశారు.