DCMS గోదామును సందర్శించిన కలెక్టర్

DCMS గోదామును సందర్శించిన కలెక్టర్

MBNR: జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ ఎరువుల గోదామును జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా గురువారం సందర్శించారు. యూరియా కోసం యాప్‌లో బుక్ చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇవ్వాలని ఆదేశించారు. ఈ పాస్‌లో విక్రయాలకు, నిల్వలకు ఎటువంటి తేడా ఉండకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం 7652 బ్యాగుల యూరియా నిల్వలు ఉన్నాయని ఎటువంటి యూరియా కొరత లేదన్నారు.