VIDEO: నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
మఠంపల్లి మండలం పాత దొనబండ తండాలో మాలోతు పీకు తన పొలంలో అక్రమంగా సిద్ధం చేసిన 50 లీటర్ల బెల్లం పానకాన్ని మఠంపల్లి ఎస్సై పెద్దపంగు బాబు సిబ్బందితో కలిసి నిర్వీర్యం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. గ్రామాల్లో జరిగే అక్రమ సారా వ్యాపారంపై సమాచారం కోసం ప్రజలు 8712686052 నెంబర్‌కి ఫిర్యాదు చేయాలని ఎస్సై పిలుపునిచ్చారు.