సజ్జాపురంలో సీసీ రోడ్డు ప్రారంభం
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సజ్జాపురంలో రూ. 15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును గుండ్లపాలెం పీ.ఎ.సీ.ఎస్.సొసైటీ ఛైర్మన్ పముజుల ప్రదీప్తో కలిసి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. కోటంరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు అని, కూటమి ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.