100కు డయల్ చేస్తూ విసిగించాడు.. రెండు రోజుల రిమాండ్

100కు డయల్ చేస్తూ విసిగించాడు.. రెండు రోజుల రిమాండ్

వనపర్తి: మద్యం తాగి నిరంతరం 100 నంబర్‌కు డయల్ చేస్తూ న్యూసెన్స్ సృష్టించిన తోట శ్రీనివాస్ అనే వ్యక్తికి కోర్టు రెండు రోజుల రిమాండ్ విధించిందని ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఎదుల గ్రామానికి చెందిన ఇతను ప్రభుత్వ సమయాన్ని వృథా చేస్తూ విలువైన ఎమర్జెన్సీ సేవలకు ఆటంకం కలిగించాడని పేర్కొన్నారు. నిందితుడిని వనపర్తి జడ్జి ముందు హాజరు పరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.