రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏకి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏకి తీవ్ర గాయాలు

KMM: రోడ్డు ప్రమాదంలో వీఆర్‌ఏకి  తీవ్ర గాయాలైన ఘటన బోనకల్ మండలంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రావినూతల గ్రామ సమీపంలో బైక్‌పై వెళ్తున్న వీఆర్ఎ అప్పయ్య సుబాబుల్ లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు.