VIDEO: మొంథా తుపాన్‌తో పెరిగిన ముడసర్లోవ నీటి మట్టం
VSP: ముడసర్లోవ రిజర్వాయర్‌లో నీటి మట్టం గణనీయంగా పెరిగింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఈ రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. రిజర్వాయర్‌లోకి 7.1 అడుగుల వరకు కొత్త నీరు చేరిందని ముడసర్లోవ నీటి సరఫరా విభాగం అధికారులు ఇవాళ తెలిపారు. తుపాన్‌కు ముందు రిజర్వాయర్‌లో 157.5 అడుగుల నీరు ఉండేది. వరద నీటితో కలిసి ప్రస్తుతం నీటి మట్టం 164.6కు చేరిందని వారన్నారు.