జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్: ఎస్పీ

VZM: AP డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలతో రహదారి భద్రతా దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం తెలిపారు. రహదారి ప్రమాదాలకు ప్రధాన కారణాలైన డ్రంక్ అండ్ డ్రైవ్, అధిక స్పీడ్, హెల్మెట్ ఉల్లంఘించిన వారిపై కేసులునమోదు, ఈ చలనాలు విధించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్ని అధికారులకు సూచించారు.