ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం
నంద్యాల: డోన్ మండలం కొత్తపల్లి బ్రిడ్జీ సమీపంలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై నడుస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.