హౌసింగ్ బోర్డులో ప్రమాదం.. కార్మికుడి మృతి
NGKL: జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్‌లో ఆదివారం విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్న కుడికిళ్ల గ్రామానికి చెందిన దినసరి కూలీ వెంకటేశ్ అనుకోకుండా కింద పడిపోవడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆయనను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.