ఛత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు భూమి పూజ
SDPT: చిన్నకోడూర్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటుకు గ్రామస్తులు శనివారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు జోరుగా నినాదాలు చేసి మాట్లాడారు. శివాజీని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామ యువత, నాయకులు తదితరులు పాల్గొన్నారు.