కొత్త ముకుందాపురం పాఠశాల తనిఖీ
SRPT: మునగాల మండలం కొత్త ముకుందాపురం ప్రాథమిక పాఠశాలను సూర్యాపేట జిల్లా తనిఖీ బృందం సోమవారం సందర్శించింది. ప్రార్థన సమయానికే చేరుకున్న బృందం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరును పరిశీలించింది. అనంతరం పాఠశాలలో అమలు చేస్తున్న అభ్యాసనాభివృద్ధి కార్యక్రమాలను సభ్యులు మధుసూదన్ రెడ్డి, బృందం క్షుణ్ణంగా తనిఖీ చేశారు.