VIDEO: ధన్వంతరి ఆలయంలో ఘనంగా ఆరోగ్య హోమం

VIDEO: ధన్వంతరి ఆలయంలో ఘనంగా ఆరోగ్య హోమం

JGL: జగిత్యాల పట్టణంలోని చింతకుంట వాడలో గల శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయ బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం ఆలయంలో ఆరోగ్య హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ వడ్లగట్ట రాజన్న, రామ లింగారెడ్డి, వోడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు.