వైజాగ్ నుంచి చౌకగా విమానయానం

వైజాగ్ నుంచి చౌకగా విమానయానం

విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్ ఏషియా సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జీరో బేస్ ఫేర్ పేరుతో విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జులై 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు మాత్రమే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు.