శవమై తేలిన అదృశ్యమైన మహిళ

శవమై తేలిన అదృశ్యమైన మహిళ

BHPL: గణపురం మండల కేంద్రానికి చెందిన సిరంగి లావణ్య (38) అదృశ్య ఘటన విషాదంగా ముగిసింది. మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె, బుధవారం గణపసముద్రం చెరువులో శవమై తేలింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీసి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.