రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: మాజీ ఎమ్మెల్యే
GNTR: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో వైసీపీ కార్యకర్తలను కూటమి నేతలు ఇబ్బందులు పెడుతున్నారని తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. ఈ మేరకు ఇవాళ వైసీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి 'డిజిటల్ బుక్'ను ఆయన ఆవిష్కరించారు. కార్యకర్తలకు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా 'డిజిటల్ బుక్'లో ఫిర్యాదు చేయాలని సూచించారు.