జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీల నిరసన

కాకినాడ: జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడి సిబ్బంది, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ కాకినాడలో ఈరోజు పెన్షన్ కానుక కార్యక్రమంలో పాల్గొనడంతో పోలీసులు భారీగా అక్కడ మొహరించారు. ప్రభుత్వం మొండి వైఖరి విడిచి తమ న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.