మున్సిపల్ పన్నులు వెంటనే చెల్లించాలి: కమిషనర్
GNTR: పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి, నీటి, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలను వెంటనే చెల్లించాలని కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు కోరారు. పట్టణ అభివృద్ధికి ఈ నిధులు ఎంతో కీలకమని, వీటి ద్వారానే పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ప్రజలు బాధ్యతగా పన్నులు చెల్లించాలని కోరారు.