ఉమ్మడి జిల్లా ప్రజలకు గమనిక.. ఇండిగో ఫ్లైట్ రద్దు
CTR: ముంబై నుంచి రేణిగుంటకు రాకపోకలు సాగించే ఇండిగో విమానాన్ని యాజమాన్యం సోమవారం రద్దు చేసింది. వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడికి వచ్చే అన్ని ఇండిగో విమానాలు సమయానికి రాకపోకలు సాగించాయి. అయితే ఈ ఒక విమానాన్ని మాత్రం కొన్ని కారణాలతో రద్దు చేసినట్లు తెలిసింది. అయితే ప్రయాణికులకు ముందుగానే సందేశాలు పంపించారు.