సంజీవని ఆస్పత్రిని సందర్శించిన ప్రధాని
ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో గుండె సంబంధింత శస్త్రచికిత్సలు చేయించుకున్న చిన్నారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్నారులు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు ధ్రువపత్రాలు అందజేశారు.