ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం: టీపీసీసీ చీఫ్

ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయం: టీపీసీసీ చీఫ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్‌కుమార్ స్పందించారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తల విజయమని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని, ఈ తీర్పుతో ప్రజలు బీఆర్ఎస్‌కు సెలవు పలికారని ఆరోపించారు.