VIDEO: 'అధ్వానంగా లక్ష్మీపూర్-వాడేగాం రోడ్డు మార్గం'
ADB: భీంపూర్ మండలంలోని లక్ష్మీపూర్ మీదుగా వాడేగాం గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం పూర్తిగా అధ్వానంగా మారింది. రోడ్డుపై ఉన్న బండరాళ్లు తేలడంతో ప్రయాణం ఇబ్బందిగా మారిందని గ్రామస్తులు తెలిపారు. రాత్రి వేళల్లో రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో జారిపడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోయారు. అధికారులు, నాయకులు స్పందించి రోడ్డు బాగు చేయాలని కోరుతున్నారు.