మినీ బాలామృతం ప్యాకెట్ల పంపిణీ ప్రారంభం

గంట్యాడ మండలం నరవ అంగన్వాడీ కేంద్రంలో ఏడాదిలోపు చిన్నారులకు మినీ బాలామృతం ప్యాకెట్ల పంపిణీని శనివారం మధ్యాహ్నం స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రుక్సానా బేగం ప్రారంభించారు. ఈ మినీ బాలామృతం బలవర్ధకమైన పోషకాహారమని అన్నారు. కార్యక్రమంలో డీసీపీఓ లక్ష్మి, గంట్యాడ ఐసీడీఎస్ సీడీపీఓ ఉమాభారతి, సూపర్వైజర్లు పాల్గొన్నారు.