సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
JGL: సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. గురువారం కోరుట్ల మండలం పైడిమడుగులో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిబంధనలు అమలులో ఉంటాయని, 144 సెక్షన్ కూడా అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు.