ట్రంప్, బైడెన్ హత్యకు కుట్ర.. దోషిగా పాక్ వ్యక్తి
అమెరికా నేతలు ట్రంప్, బైడెన్‌లను చంపేందుకు కుట్ర పన్నిన పాక్ జాతీయుడు ఆసిఫ్ మర్చంట్‌ను (48) బ్రూక్లిన్ ఫెడరల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. 2020లో ఇరాన్ జనరల్ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఆ దేశం తరఫున ఈ ప్లాన్ చేసినట్లు తేలింది. హంతకులుగా భావించి FBI ఏజెంట్లకు 5,000 డాలర్లు అడ్వాన్స్ ఇచ్చి దొరికిపోయాడు. ఇతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.