VIDEO: సంగారెడ్డిలో హోలీ పండుగ.. దుకాణాలలో సందడి
SRD: పట్టణంలోని ఐబీ, బైపాస్ రోడ్డు, అంబేద్కర్ విగ్రహం వద్ద హోలీ సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. పాత బస్టాండ్ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు ప్రత్యేక దుకాణాలు ఏర్పాటు చేశారు. పిల్లలను ఆకట్టుకునే పిచికారీలు, విభిన్న మాస్కులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఉత్సాహంగా రంగులు, పూజా సామగ్రిని కొనుగోలు చేయడంతో పట్టణం కోలాహాలంగా మారింది.