కొత్తపేటలో కారు బీభత్సం అదుపుతప్పి ప్రహరీ గోడను ఢీకొన్న ఘటన

BPT: వేటపాలెం మండలం కొత్తపేట మూడు రోడ్ల సెంటర్లో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న గుర్తు తెలియని యువకులు అదుపుతప్పిన కారు లాయర్ ఇంటి గోడను ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా మరో ఇంటి గోడను కూడా ఢీ కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.