VIDEO: సింహాచలేశుని సన్నిధిలో డీఆర్డీవో ఛైర్మన్
VSP: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ సమీర్ వీ. కామత్ సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలను బహూకరించారు.