ఆ అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని

ఆ అనుభవాలు వింటుంటే అద్భుతంగా ఉంది: ప్రధాని

ఢిల్లీలో జరిగిన NDA సీఎంల కాంక్లేవ్‌లో అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. నీటి సంరక్షణ, ఫిర్యాదుల పరిష్కారం, అడ్మినిస్ట్రేటివ్ ఫ్రేమ్ వర్క్‌లను బలోపేతం చేయడం, విద్య, మహిళా సాధికారత, క్రీడలు, తదితర విభిన్న రంగాల్లో చేపడుతున్న ఉత్తమ పద్ధతులను ఆయా రాష్ట్రాలు ప్రదర్శించాయని వెల్లడించారు. ఈ అనుభవాలను వినడం చాలా అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.