బస్సు కోసం 2, 3 కి.మీ నడవాల్సిందే..

బస్సు కోసం 2, 3 కి.మీ నడవాల్సిందే..

HYD: అల్లాపూర్ సమీప ప్రాంతాల వాసులు సిటీ బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గాయత్రినగర్, తులసినగర్, వివేకానందనగర్, లక్ష్మినగర్ నుంచి కేవలం ఉదయం, సాయంత్రం సమయాల్లో అదీ నామమాత్రమే బస్సులు నడుస్తున్నాయి. మిగతా సమయాల్లో బస్సులుండవు. దీంతో స్థానికులు ఎక్కడికైనా వెళ్లాలంటే 2, 3 కిలోమీటర్లు వెళ్లి బస్సెక్కాల్సి ఉంటుంది. అధికారులుబస్సుల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు.