'ఆటోలకు త్వరలో సీరియల్ నంబర్లు'
VZM: విజయనగరం పట్టణంలోని ఆటోలను క్రమబద్ధీకరించేందుకు త్వరలో సీరియల్ నంబర్లు ఏర్పాటు చేస్తామని ట్రాఫిక్ సీఐ సిహెచ్. సూరినాయుడు తెలిపారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో ఆటో యూనియన్ నాయకులతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రత, రహదారి నియమాల పాటింపుతో పాటు ప్రయాణికులు మరిచిపోయిన వస్తువులు గుర్తించేందుకు సీరియల్ నంబర్లు ఉపయోగపడతాయని చెప్పారు.