'అన్నదానం ఎంతో గొప్పది'

'అన్నదానం ఎంతో గొప్పది'

VSP: అన్నదానం చేయడం, స్వీకరించడం ఎంతో గొప్పదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు సతీమణి వెలగపూడి సృజన అన్నారు. శనివారం పెదవాల్తేరు శ్రీ కరకచెట్టు పోలమాంబ దేవస్థానంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులకు అన్న ప్రసాదం వడ్డించిన అనంతరం ఆమె మాట్లాడుతూ భక్తుల ఆకలి తీర్చడం అదృష్టమన్నారు.