నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

నేడు పలు ప్రాంతాల్లో పవర్ కట్

W.G: భీమవరం 33/11 KV ఉపకేంద్రం పరిధిలో ఇవాళ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని EE వెంకటేశ్వరరావు తెలిపారు. లైన్‌లకు మరమ్మతుల నేపథ్యంలో ప్రకాశం చౌక్, మున్సిపల్ ఆఫీస్, మావుళ్లమ్మ గుడి, సుంకర మద్దయ్య వీధి, బ్యాంకు కాలనీ తదితర ప్రాంతాలలో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు ఈ మార్పును గమనించి సహకరించాలన్నారు.