తిరుమల అన్నప్రసాదాలపై అంబటి ప్రశంసలు

తిరుమల అన్నప్రసాదాలపై అంబటి ప్రశంసలు

AP: తిరుమలలో అన్న ప్రసాదాలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసలు కురిపించారు. తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో అన్నప్రసాదాలు బాగున్నాయని పేర్కొన్నారు. రుచిగా, శుచిగా ఉన్నట్లు తెలిపారు. నాణ్యమైన అన్నప్రసాదాలను భక్తులకు పెడుతున్నారని అన్నారు. స్వామివారి దర్శనం అనంతరం ఈ మేరకు యూట్యూబ్‌లో వీడియోను విడుదల చేశారు.