కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 33 మంది దరఖాస్తులు

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి 33 మంది దరఖాస్తులు

WGL:14వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఊహించని విధంగా 33 మంది దరఖాస్తులు వచ్చాయి. ఒక్క పదవి కోసం ఇంతమంది పోటీ పడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్ని దరఖాస్తులు రావడానికి పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న పాత కార్యకర్తలు ఈ పరిణామంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.