ప్రాజెక్టులో దూకి యువకుడి ఆత్మహత్య
KMR: నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన న్యాయపు సంగమేశ్వర్(30) బుధవారం మధ్యాహ్నం నిజాంసాగర్ డ్యామ్ 16 గేట్ల సమీపంలోని గణేశ్ ఆలయం వద్ద నీటిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహ జీవితంలో విడాకుల కారణంగా మనస్తాపం చెంది, మద్యానికి బానిసై జీవితంపై విరక్తితో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు మృతుడి తండ్రి హన్మండ్లు ఫిర్యాదు చేశారు.