బొగత జలపాతం వద్ద ఇదీ పరిస్థితి..!

MLG: బొగత జలపాతానికి ప్రవాహం పెరిగింది. సోమవారం కురిసిన భారీ వర్షానికి జలపాతంలో వరద ఉద్ధృతి పెరిగింది. పర్యాటకులు కొలనులోకి దిగేందుకు అనుమతి లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు. కాగా, నో ఎంట్రీ ప్రాంతాల్లోకి వెళ్లడం, సెల్ఫీలు దిగడం లాంటివి నిషేధమన్నారు. సిబ్బంది చెప్పే సలహాలు, సూచనలు పాటించి అధికారులకు సహకరించాలని రేంజర్ చంద్రమౌళి కోరారు.