రాప్తాడులో టీడీపీ కార్యకర్త మృతి
అనంతపురం జిల్లా రాప్తాడులోని సికేపల్లిలో నందిగారి వెంకట్రాముడు అనే టీడీపీ కార్యకర్త ఇవాళ అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే ఆయన గత కొద్ది రోజులుగా హెర్నియా వ్యాధితో బాధపడుతూ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు. జబ్బు తీవ్రతరం కావడంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.