తెలంగాణ కోసం దొంగ దీక్ష చేశారు: టీపీసీసీ చీఫ్
TG: నల్గొండ డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత మాటలను సమర్థించను అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కైలాష్ నేత ఇప్పటికే బహిరంగ క్షమాపణ చెప్పారన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కొందరు దొంగ దీక్షలు చేసి.. విద్యార్థులను రెచ్చగొట్టారని పరోక్షంగా KCRను విమర్శించారు. తెలంగాణను పదేళ్ల పాటు దోచుకున్నారని మండిపడ్డారు.