సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీఐ
ATP: గుత్తి మండలం కరటికొండ గ్రామంలో సైబర్ నేరాలపై శక్తి టీం ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఆపద సమయాలలో శక్తి యాప్ ఉపయోగాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సురేష్ పాల్గొన్నారు.