పాత్రికేయుడుకి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
E.G: అనపర్తి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీనియర్ పాత్రికేయుడు టీవీఎస్ భీమరాజు మృతికి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనపర్తి ప్రెస్ క్లబ్ వద్ద శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని భీమరాజు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పాత్రికేయ రంగంలో భీమరాజు విశేష కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.